Hot Posts

6/recent/ticker-posts

 

Y



                          భారత వనిలో ఒకే ఒక్కడు
కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం లో ఒక సామాన్య స్వర్ణకారుడు  తాళబత్తుల సత్యనారాయణ సావిత్రమ్మ దంపతులకు 19 68 వ సంవత్సరంలో జన్మించిన తాళ బత్తుల సాయి తన విద్యాభ్యాసం పాఠశాల నుండి కళాశాల విద్య వరకు ప్రభుత్వ పాఠశాలలలో తన విద్యను అభ్యసించారు పాఠశాల విద్యను అభ్యాసించే అప్పటినుండి తమ తండ్రితో చేదోడువాదోడుగా ఉంటూ తండ్రిస్ఫూర్తితో స్వర్ణకారుడిగా తమ జీవనశైలిని మొదలుపెట్టి స్వర్ణ ఆభరణాల తయారీలో ప్రతిభ చాటుతూ... సూక్ష్మ కళాఖండాల  శిల్పిగా  పేరు పొందారు 
ఆయన చేతిలో సూక్ష్మ కళాఖండాలు ఒదిగిపోతాయి అవార్డులు కళాఖండాల ముందు మోకరిల్లుతాయి తనలోని కళ నైపుణ్యానికి నిరంతరం పదును పెడుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను సాధించి సూక్ష్మ కళ బిందు కళ పట్ల తాను ఎన్నో రికార్డులను సాధించారు 

పెన్సిల్ ముల్లుపై తయారుచేసిన సూక్ష్మ కళాఖండాలు

 గౌతమ బుద్ధుడు వెంకటేశ్వరుడు. గోదావరి మాత. స్క్రూ నట్టు. శివలింగం. నందీశ్వరుడు చేప . బిందు కళలో భాగంగా 20వేల బొట్టు  బిళ్ళ లతో ఎన్టీఆర్ చిత్రం.. 8 వేల బొట్టు బిల్ల లతో  వినాయకుని చిత్రం.. పదివేల బొట్టు బిల్లలతో బిందు కల ద్వారా గౌతమ బుద్ధుని చిత్రం తయారు చేశారు 
ఇతర కళాఖండాలు తయారుచేసి సూక్ష్మ కళాకారునిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.. లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.. మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్.. మార్వలాస్ వరల్డ్ రికార్డ్స్.. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ..బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్.. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ..ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. సాధించి 2016 సంవత్సరంలో సూక్ష్మ పూర్ణకుంభం తయారుచేసి గౌరవ డాక్టరేట్ బిరుదుని పొందారు 
మినీ యేచర్ ఆర్ట్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన తొలి భారతీయుడు తెలుగువాడు సూక్ష్మ కళాకారుడు  
 ఎదుగుతున్న తాళాబత్తుల సాయి డిసెంబర్ 10వ తేదీన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని పెద్దాపురం పట్టణంలో రహదారులకు ఇరువైపులా బస్టాండ్ వద్ద  మార్కెట్లలో బిక్కు బిక్కు మంటూ జీవనాన్ని గడిపే అనాథులైన నిరుపేదలకు అర్ధరాత్రి సమయంలో తమ వంతు సహాయంగా చలి గాలిలో నిదురించే ఆ నీరు పేదలకు తాళబత్తుల సాయి తమ సతీమణి ఉదయ భాస్కర కామేశ్వరి దంపతులు దుప్పట్లు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది 
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలలో ఫేస్బుక్ వాట్సప్ ఇనిస్టా ప్రచారమాధ్యమాలలో ఎవరైనా ఏదైనా చిన్న  కార్యక్రమం చేసి అనేక ప్రచారాలు చేసుకునే ఈ రోజుల్లో ఎన్నో రికార్డులు సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీతగా ఎన్నో పథకాలు అవార్డులు అందుకొని ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి అనే నినాదంతో ఎటువంటి ఏ విధమైన ప్రచారాలు లేకుండా ఒక సామాన్య స్వర్ణ కళాకారుడుగా సాయి .
పెద్దాపురం పట్టణంలో ఏ విధమైన హంగు ఆర్భాటాలు లేకుండా తనదైన శైలిలో ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా చిరునవ్వుతో పలకరిస్తూ అందరితో కలిసిమెలిసి ఎదిగే కొద్ది ఒదిగి ఉండడం తన నైజం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత మట్టిలో మాణిక్యం అనడానికి నిదర్శనం తాళ బత్తుల సాయి.