Hot Posts

6/recent/ticker-posts



 కనుమ పండుగ సందర్భంగా గోవులను పూజించిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి కుటుంబం

కాకినాడ జిల్లా జగ్గంపేట :భారతీయ ధర్మ పరిష త్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో కనుల పండుగగా కనుమ పండుగ నిర్వహించారు. కనుమ పండుగ ముఖ్య ఉద్దేశం అందులో కుటుంబ సభ్యులతో కలిసి గోమాతలను శుభ్రం చేసి పూజించారు. ఈ సందర్భంగా

నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ మా  సత్య భారతి గోశాల లో ఈరోజు రైతుగా నేను ఈ కనుమ పండుగ కార్యక్రమం కుటుంబ సభ్యులతో జరుపుకోవడం జరిగింది, గోవులను శుభ్రంగా కడిగి అలంకరించుకుని కనుమ పండుగ రోజున గోవుల్ని ఏ పని చెప్పకుండా గోవులను, ఆరాధించి పూజించి గోవులకి నచ్చిన ఆహారాన్ని అందించి గోపూజ కార్యక్రమంతో పాటు ఈరోజు అంతా కూడా, గోవులతో ఉండి గోవుల పండుగగా ఈరోజు జరుపుకోవడం మాకు ఆనందకరంగా ఉందని తెలియజేశారు, గోవు మన ఆరాధ్య దైవం సకల దేవతలు కొలువైనది గోమాత, గోమాత మన సనాతన సంపద  ప్రతి ఒక్కరూ సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు గోవులను ఆరాధించాలని గోపూజ ప్రతిరోజు చేయాలని గోవులను రక్షించాలని గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర చౌదరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.