Hot Posts

6/recent/ticker-posts



 రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది...

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ...

నేషనల్ హైవే నుండి శెట్టి బలిజిపేట నిర్మాణం అవుతున్న సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించిన  ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ....

కాకినాడ జిల్లా జగ్గంపేట :కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పైన, గ్రామీణ రోడ్ల నిర్మాణం పైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన జగ్గంపేట శెట్టిబలిజిపేట నుండి నేషనల్ హైవే కి పేజ్ వన్ లో ఎన్ ఆర్ జి ఎస్ నిధులతో 65 లక్షలతో నిర్మాణం అవుతున్న సిమెంట్ రోడ్డు పనులను ఆయన పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక  గుంతలు లేని రహదారులే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మత్తు పనులు నిర్వహించామన్నారు. నూతన రహదారుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. గ్రామ స్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకూ ప్రతీ రహదారి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. 

వైకాపా పాలనలో గుంతల రహదారులు వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు రోడ్ల అభివృద్ధి, మరమ్మత్తులపై దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు, రోడ్లు కూడా దారుణంగా దెబ్బతిన్నాయని, వాటన్నిటిని తిరిగి బాగు చెయ్యడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. జాతీయ రహదారి నుండి శెట్టిబలిజిపేట వెళ్లే రోడ్డు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 65 లక్షల విధులతో మొదటి భాగం నిర్మాణం శరవేయంగా సాగుతుందని ఎక్కడ రాజీ లేకుండా క్వాలిటీగా రోడ్డు నిర్మిస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, పీల మహేష్, మండపాక అప్పన్న దొర పంచాయతీరాజ్ డిఇ ఉమాశంకర్, జేఈ నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.