కాకినాడ జిల్లా జగ్గంపేట : నూతనంగా రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన వనపర్తి వీరభద్రరావు (బద్రి) ఆదివారం జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూను, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ బద్రిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బద్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆశీస్సులతో రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్నాను వీరి సహకారంతో పెరిక కులాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తూ వారికి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ బద్రి పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి అని ఆయనను పార్టీ గుర్తించి గౌరవించిందని గత ఎన్నికల్లో రాష్ట్రమంతా క్యాంపెయిన్ చేస్తూ జగ్గంపేట నియోజకవర్గం లో కూడా మూడు రోజుల కేటాయించి ఇ క్కడ పెరిక కులానంత ఐక్యమత్యంగా కూటమి ప్రభుత్వానికి పనిచేసే విధంగా కష్టపడ్డారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లేపల్లి సొసైటీ చైర్మన్ దిడ్డి వెంకట్ రాజు ( చిన్న శ్రీను) గండేపల్లి మాజీ జడ్పిటిసి య ర్రంశెట్టి బాబ్జి, కిర్లంపూడి మండల టిడిపి ప్రధాన కార్యదర్శి గోడే బాల, రామకృష్ణాపురం సర్పంచ్ కంఠ శ్రీను, వనపర్తి సాంబశివరావు, పల్లపు సుబ్బారావు, నడిశెట్టి రాంబాబు, బిజెపి జిల్లా కార్యదర్శి గొల్ల శ్రీనివాస్ జిల్లా పెరికకుల పెద్దలు, రాష్ట్ర, జిల్లా పెరిక సాధికారక సమితి కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు.
