Hot Posts

6/recent/ticker-posts





 తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా జగ్గంపేటలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు

రంగురంగుల ముగ్గులతో పండుగ సంబరాలకు ప్రత్యేక శోభ...

హాజరైన జ్యోతుల నెహ్రూ దంపతులు, జ్యోతుల నవీన్ దంపతులు..

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత...

కాకినాడ జిల్లా జగ్గంపేట జనవరి 12:సంక్రాంతి అంటే మొదటగా గుర్తుకు వచ్చేది రంగవల్లులు, గొబ్బెమ్మలేనని, పల్లెల్లో సంక్రాంతి పనులు మొదలు అయ్యేది కూడా నెల ముగ్గు పెట్టడం తోటే అని, రంగవల్లులు  భారతీయ సంస్కృతిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ  పేర్కొన్నారు. 

జగ్గంపేటలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలు, భోగి మంటలు, రంగవల్లులు గొబ్బెమ్మలు, కోలాటాలు, కూచిపూడి నృత్యాలు ఇలా అన్ని రకాల సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయ మానంగా జరిగింది. ఈ కార్యక్రమాలను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు ప్రారంభించారు.

 మరో అతిథిగా జనసేన పార్టీ ఇంచార్జి తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ, జగ్గంపేట మహిళా శక్తి ఆధ్వర్యంలో పిండివంటలు వండి ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు తంటికొండ దేవస్థానం చైర్మన్ బదిరెడ్డి అచ్చన్న దొర ఆధ్వర్యంలో వచ్చిన వారందరికీ ప్రసాదం పంపిణీ, వివిధ వర్ణాలతో మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను  ఆయన పరిశీలించారు.మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, పండుగ సంబరాలకు ప్రత్యేక శోభను చేకూర్చడానికి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయడానికి ఈ సంక్రాంతి సంబరాలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు.

అనంతరం విజేతలకు, పాల్గొన్న వారందరికీ కన్సిలేషన్ బహుమతులు అందజేసిన జ్యోతుల లక్ష్మీదేవి వివిధ రకాల కూచిపూడి నృత్యాలు, కోలాటాలు, బుర్రకథలు, ఉయ్యాలలు ఆహుతులను అలరించాయి. జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు కోడిపందాలు నిర్వహించి కోడిపందాలు సాంప్రదాయ క్రీడని దానిని కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు జోద క్రీడగా మార్చారని అందరూ సంతోషంగా కుటుంబంతో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవాలని ఎవరూ కూడా జోధాలకు పాల్పడవద్దని కోరారు. 

ఈ కార్యక్రమాన్ని నాలుగు మండలాల ఎంపీడీవోలు ఎంతో చక్కగా ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో జగ్గంపేట జగ్గంపేట నియోజకవర్గం లోని తెలుగుదేశం, జనసేన, బిజెపి కుటమి నాయకులతోపాటు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.