కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్కి కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన దుర్గ,అనే ఆమె 2022 వ సంవత్సరం నుండి డ్వాక్రా యాని మేటర్ . గ్రామ స్వయం సహాయక సంఘము ల సహాయకురాలు గా)(విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) గా పనిచేస్తు 42 డ్వాక్రా గ్రూప్ లకు ఇన్ చార్జ్ గా ఉంటూ డ్వాక్రా గ్రూప్ ల పర్యవేక్షణ రికార్డుల మెయింటినెన్స్ మరియు సమావేశంలను నిర్వహించుట ఆమె బాధ్యతలు. ఆ క్రమము లో బూరుగుపూడి గ్రామము లో తన పరిధి లో గల 12 గ్రూప్ లకు 2023 వ సంవత్సరం లో స్త్రీ నిధి ద్వారా లోను ఇప్పించి సదరు లోను లోని 8 గ్రూప్ ల సబ్యుల నుండి వేరే డబ్బులు మీ అక్కౌంట్ లలో పడ్డాయి అని వారి సంతకాలు/వేలిముద్రలు తీసుకుని 8 గ్రూప్ ల వద్ద నుండి మోస పూరితముగా సుమారు 20 లక్షల 25 వేల రూపాయలు కాజేసి గ్రామం నుండి పారిపోవడం జరిగింది. దీనిపై కిర్లంపూడి పోలీసు వారికి ది.24.05.2025 వ తేదీన దేవి శక్తీ డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ K. వీర లక్ష్మి ఇచ్చిన పిర్యాదు మీద కిర్లంపూడి పోలీసు స్టేషన్ నందు
ఫిర్యాదు చేయగా సదరు ఫిర్యాదు పై కిర్లంపూడి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది.
సదరు నిందితురాలు దుర్గ ను పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీ హరి రాజు పర్యవేక్షణలో, జగ్గంపేట సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కిర్లంపూడి ఎస్ ఐ జి. సతీష్, డబ్ల్యుహెచ్ సి గురుశ్రీ, పిసి శివప్రసాద్ లు అనేక రకాలుగా ప్రయత్నించి ఆమెను అరెస్టు చేసి ప్రత్తిపాడు గౌరవ కోర్టు వారి వద్ద హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విదించగా రాజమండ్రి మహిళా జైలుకు తరలించడం జరిగిందని సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలియజేశారు
