Hot Posts

6/recent/ticker-posts

పూడి విశాలాక్షి బీసీ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం

 ఎన్ హెచ్ ఆర్ పి ఫారం జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సీఈవో టి ఎస్ రామచంద్ర నాయుడు బోర్డు డైరెక్టర్ మాధవి లత వారి ఆదేశాల మేరకు సమస్యలు పరిష్కార లక్ష్యంగా 

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ బాలికల వసతి గృహం నందు ఉంటున్న బాలికలు గత సంవత్సర కాలంగా వసతి గృహంలో వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ఎన్ హెచ్ ఆర్ పి ఎఫ్ జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఇన్చార్జ్ వలీ ఖాన్  దృష్టికి తెలియజేయగా వలి ఖాన్ స్పందించి గత సంవత్సర కాలం నుండి తగిన ఆధారాలు సేకరించి ఈరోజు అనగా 18 జూలై 2025 తేదీన ఈ విషయం గాను స్థానిక పెద్దాపురం రెవెన్యూ అధికారి వారికి ఎన్ హెచ్ ఆర్ పి  ఫారం  రాష్ట్ర ఇంచార్జ్ వలీ ఖాన్ ద్వారా మండల రెవెన్యూ అధికారి వారికి తెలియజేయగా 

వెంటనే స్పందించి తమ రెవిన్యూ బృందం డిప్యూటీ తాసిల్దార్ రెవెన్యూ ఇనిస్పెక్టర్ వారిని వారి బృందాన్ని బీసీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేయమని పంపించడం జరిగింది

 వారి విచారణలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వసతి గృహం బాధ్యతలు వహిస్తున్న వార్డెన్ బాలికలను ఇబ్బంది పెడుతున్న విషయాలు వివరించారు తమకు తాగడానికి స్థానాలు చేయడానికి మరుగుదొడ్లలో వంటలలో ఉపయోగించడానికి ఒకే రకమైన నీళ్లను ఇస్తున్నారని వసతి గృహంలో ఉంటున్నటువంటి 80 మంది విద్యార్థులకు కేవలం మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయ తమకు రోజు ఇవ్వవలసిన పాలు గుడ్లు ఇవ్వడం లేదని ఈ నెలలో ఇప్పటికీ కేవలం మూడు రోజులు మాత్రమే గుడ్లు ఇచ్చారని మెనూ ప్రకారం గా రోజుకు రెండు రకాల కూరలు పెట్టవలసి ఉండగా ఒక రకమైన కూర మాత్రమే చాలీచాలకుండా పెడుతున్నారని ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇవ్వాల్సిన అల్పాహారం  ప్రసాదంల వడ్డిస్తున్నారని అల్పాహారంలో భాగంగా అరటిపండు జామ కాయలు పండ్లు పెట్టవలసి ఉండగా ఏ రోజు కూడా తమకు పండ్లు పెట్టడం లేదని వసతి గృహం నందు సరైన శుభ్రత లేకపోవడం వల్ల తమకు చర్మవ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలియజేసినప్పటికీ వార్డెన్ పట్టించుకోవడంలేదని ఎవరైనా బాలికలు ఫిర్యాదు చేసిన ఎడల వారినే టార్గెట్గా చిత్రహింసలకు వార్డెన్ గురి చేస్తున్నారని అంతేకాకుండా కొంతమంది బాలికలను వార్డెన్ కొడుతున్నారని కూడా ఫిర్యాదు లో పేర్కొన్నారు

 వసతిగృహం తనిఖీ చేయడానికి వచ్చిన అధికారులు వెంటనే స్పంది విషయాన్ని జిల్లా కలెక్టర్ వారికి ఉన్నత అధికారులకు తెలియజేయగా హుటాహుటిన ఆర్డీవో స్థానిక ఎంపీడీవో బీసీ వెల్ఫేర్ వసతి గృహాల అధికారులు పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తదితరులు విచ్చేసి సమస్యలు క్లుప్తంగా అడిగి తెలుసుకుని వార్డెన్ పూడి విశాలాక్షి ని సస్పెండ్ చేసినట్లుగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అధికారులు తెలియజేశారు

 సమస్య పట్ల స్పందించిన అధికారులందరికీ పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు ఎన్ హెచ్ ఆర్ పి ఫారం తరపున రాష్ట్ర ఇంచార్జ్ వలీ ఖాన్ ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్రంలో ఎక్కడైనా బాలికలైన బాలురైన వసతి గృహాలలో ఇబ్బందులకు గురవుతున్నట్లయితే వసతి గృహాలలో సరైన సదుపాయాలు లేకపోయినా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమస్త వారికి ఫిర్యాదు చేసిన యెడల సంబంధిత ఉన్నతాధికారుల సహకారంతో తక్షణమే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని ఎన్ హెచ్ ఆర్ పి ఎఫ్ రాష్ట్ర ఇంచార్జ్ వలి ఖాన్ తెలియజేశారు