Hot Posts

6/recent/ticker-posts

జగ్గంపేటలో ఘనంగా నిర్వహించిన ప్రమాణస్వీకారం కార్యక్రమం






                                          


 పదవి అలంకారం కాదు.. ఒక బాధ్యత

 ప్రతి టిడిపి నాయకుడు, కార్యకర్త ప్రజాసేవే  లక్ష్యంగా ముందుకు సాగాలి

అన్న ఎన్టీఆర్ ఆశయాలు.. సీఎం చంద్రబాబు స్ఫూర్తి  మన లక్ష్యం

జగ్గంపేట నియోజకవర్గ మండల, క్లస్టర్, యూనిట్, డివిజన్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

కాకినాడ జిల్లా : జగ్గంపేట, : పదవి ఒక అలంకారం కాదని.. దాన్ని బాధ్యతగా తీసుకుని తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు, ప్రజాసేవా భావంతో క్రమశిక్షణతో  పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్లాలని జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. 

గండేపల్లి మండలం జెడ్ రాగంపేట పంచాయతీలో గల పరిణయ ఫంక్షన్ హాల్ లో శనివారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన నిర్వహించిన  నియోజకవర్గo  మండల, క్లస్టర్, యూనిట్, డివిజన్, బూత్ కమిటీల 2632 మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు.

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్సీ పి రాజశేఖర్, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్, నియోజకవర్గ పరిశీలకులు ఎస్ వెంకటేశ్వరరావుహాజరయ్యారు. 

ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ, నవీన్ మాట్లాడుతూ  తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిరక్షించేందుకు ప్రతి నాయకుడు,కార్యకర్త నిరంతరం కష్టపడుతూ  ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. నిత్య చైతన్యంతో పార్టీ భవిష్యత్తు కోసం కష్టపడిన వారికి తగిన విధంగా గుర్తింపు ఇస్తామన్నారు. పార్టీ బలం కార్యకర్తలేనని, గత పాలకులు ఎన్ని బెదిరింపులకు దౌర్జన్యాలకు గురిచేసినా కష్టసుఖాలను ఎదుర్కొని పార్టీ కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలకు  తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఇచ్చి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. 

గడిచిన 17 నెలల కాలంలో నియోజవర్గాన్ని200  కోట్లతో అభివృద్ధి, సంక్షేమం చేశామన్నారు.  రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజల సంక్షేమం దిశగా దూసుకుపోతుందన్నారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు  సిద్ధం కావాలని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. అలాగే మహిళలకు కూడా తగు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు.

నవీన్ మాట్లాడుతూ  నూతనంగా బాధ్యతలు తీసుకున్న మండల అధ్యక్షులు, అన్ని విభాగాల వారు ఐక్యంగా అందరినీ కలుపుకుని  ముందుకు సాగాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ గ్రామాల్లో ఏకగ్రీవం అయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ గౌరవం కల్పిస్తుందని, నిస్వార్ధంగా, దీక్ష దక్షతలతో, అంకితభావంతో, పని చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. 

పండగ వాతావరణంలో  నియోజకవర్గం మండల, క్లస్టర్, యూనిట్,బూత్ డివిజన్ కమిటీ చేత ప్రమాణస్వీకారం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక  ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ముందు స్థానికరావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి  భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా పరిణయ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే నెహ్రూ ఆవిష్కరించారు. ఆయా మండలాలకు ఎన్నికైన అధ్యక్షులకు భవిష్యత్తులో తీసుకోవాల్సిన కర్తవ్యాలపై  నిర్దేశించారు. 

అనంతరం కేక్  కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో గల గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు నాయకులు అందరూ పాల్గొన్నారు.