ఆదిత్య యూనివర్సిటీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం
జగ్గంపేట కృష్ణవేణి కాంప్లెక్స్ ఏరియాలో తరచూ తిరుగుతూ ఉండేవాడు ఈ ఆదిత్య కాలేజ్ బస్సులు ఈ టైంలో అతివేగంగా రావడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి సుమారు నెల క్రితం జగ్గంపేట మండలం మామిడాడ లో ఆదిత్య కాలేజ్ బస్సు ఒక వ్యక్తిని బస్సు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది
ఈ ఆదిత్య కాలేజ్ బస్సులు మనుషులు ప్రాణాలతో చెలగాటలాడుతున్నాయి జిల్లా అంతా ఇదే పరిస్థితి నెలకొంది ఇకనైనా వేగం తగ్గించి జన ప్రవాహాలు తిరుగుతున్న సెంటర్లో కానీ గ్రామాలలో కానీ జాగ్రత్తగా వెళ్లాలని పలుమార్లు డ్రైవర్లకు చెప్పిన మాకు ఆదిత్య కాలేజ్ అతిపెద్ద సంస్థ కాబట్టి మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు చిన్న ఆఫీసు నుంచి పెద్ద ఆఫీసర్ వరకు మా సంస్థకు అనుకూలంగా ఉంటారు అనే ధోరణిలో ఈ ఆదిత్య బస్సుల వ్యవహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నియమ నిబంధనలు వారికి సూచించాలని అధికారులు స్పందించి అతి వేగంగా బస్సులు నడుపుతున్న డ్రైవర్ల పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రమాదం జరిగిన వ్యక్తికి తగిన మూల్యం చెల్లించాలని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అడ్వైజర్ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ జుత్తుక నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేశారు


