Hot Posts

6/recent/ticker-posts





రైతు నేస్తాలైన పశువులను పూజిద్దాం

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం; కిర్లంపూడి మండలం బూరుగుపూడి ,రైతులకు తోడు, పంటలకు మూలం మన పశువులు. రైతులకు ఆధారం పశువుల బలం అని పశువుల పట్ల కృతజ్ఞత,ప్రకృతి పట్ల ప్రేమ మనందరి బాధ్యత అని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. 
ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ ఎక్కడైతే పశుసంపద విస్తారంగా అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతమంతా ఆరోగ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గోవులను కబేళాలకు వెళ్లకుండా చేయాలని ప్రతి గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోశాలలు ఏర్పాటు చేసి  కలియుగ దైవం  వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం, స్వామివారి నైవేద్యాలకు ప్రతి గ్రామం నుండి గోశాలల నుండి వచ్చిన స్వచ్ఛమైన నెయ్యిని తిరుమల పంపించేలా ఏర్పాటు చేయాలని, 
గోవుల ద్వారా వచ్చే గోమయం గోమూత్రం ద్వారా ప్రతి గ్రామంలోనూ గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి జరుగుతుందని తద్వారా అందరూ ఆరోగ్యంగా ఉంటారని ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఈ ప్రక్రియ మీద ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునేలా శాసనసభ్యులు  నెహ్రూ  చొరవ తీసుకోవాలని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు.