Hot Posts

6/recent/ticker-posts


 కాకినాడ  విచ్చేసిన డిప్యూటీ సీఎం ని హెలి ఫ్యాట్ వద్ద  గౌరవపూర్వక స్వాగతం పలికిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ :ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ కు శంకుస్థాపన చేసేందుకు కాకినాడ విచ్చేసిన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని హెలి ఫ్యాట్ వద్ద  గౌరవపూర్వక స్వాగతం పలికిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు నేడు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకారం.. చుట్టేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని

ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టు కాకినాడలో ఏర్పాటు చేయడం ద్వారా ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎగుమతి. జర్మనీ, సింగపూర్, జపాన్ కు అమ్మోనియా ఎగుమతులు.  గ్రీన్ ఎనర్జీ రంగంలో 8 వేలమందికి ఉద్యోగ అవకాశాలు ద్వారా యువతకు మేలు జరుగుతుందని నవీన్ తెలియజేశారు ...