నూతనంగా ప్రకటించిన పోలవరం జిల్లా రంప చోడవరం నియోజకవర్గం వై రామవరం మండలం వై రామవరం గ్రామ కాపురస్తులైన లండ శారదా దేవి అనే గిరిజన మహిళ గత కొంతకాలంగా వైరామవరం మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్న భూ కబ్జాదారులపై గిరిజన ఇతరులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
స్థానిక రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఆక్రమణదారులకి సహకరించడం తో భూ కబ్జాదారులు వారిష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలో జనవరి 5వ తేదీ 2026వ సంవత్సరంలో తిరిగి ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న భూ కబ్జాదారులపై స్పందన లో ఫిర్యాదు చేయడం జరిగింది స్పందనలో ఫిర్యాదులు అందుకున్న అధికారులు వెంటనే స్పందించి సంబంధిత భూకబ్జాదారులకు నోటీసులు పంపించడం జరిగింది.
నోటీసులు అందుకున్న వారిలో గుద్దేటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గొర్ల ఈశ్వరి వేమగిరి వరప్రసాద్ మోహన్, కడబాల కొండబాబు లను ప్రోత్సహించి శారదా దేవి పై కర్రలతో దాడి చేశారు జనవరి 8వ తేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో స్థానిక సాక్షి రిపోర్టర్ తో శారద దేవి మాట్లాడుతుండగా పైన పేర్కొనబడిన వారందరూ కలిసి శారదా దేవిని నడిరోడ్డు పైన రక్తం చిందేలా కర్రలతో దాడి చేసి ఆమెను గాయపరిచినారు
సదరు గ్రామస్తులు అడ్డుకొని ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీస్ సిబ్బంది గాయపడిన బాధితురాలు వద్దకు వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు తప్ప గాయపరిచిన వ్యక్తులపై ఏ విధమైన చర్యలు తీసుకొనలేదు స్థానిక పోలీస్ స్టేషన్లో శారదా దేవి తనపై గొడవలకు వస్తున్న వారిపై తనను చంపే ప్రయత్నం చేస్తున్నారని గతంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ స్థానిక పోలీస్ సిబ్బంది ఏ విధంగా కూడా ఆమెకు రక్షణ కలిగించడం లేదని వాపోతున్నారు గిరిజన మహిళ ప్రభుత్వ భూములను అక్రమ దారుల నుండి కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే ఆమెకు సహకరించవలసిన రెవెన్యూ అధికారులే భూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ఆమె తెలియజేశారు
ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి భూ కబ్జాదారులపై తగిన చర్యలు తీసుకొని ఆమె చేస్తున్న పోరాటానికి తగిన న్యాయం చేకూర్చాలని ఆమెపై దాడి చేస్తున్న వారిని శిక్షించాలని ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు శారదా దేవి విన్నవించుకుంటున్నారు
