కాకినాడ జిల్లా జగ్గంపేట :తిరుమలలో గురువారం అన్నమయ్య భవన్ లో టిటిడి బోర్డు చైర్మన్ బీ ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన రథసప్తమి ఏర్పట్ల పై సమీక్షా సమావేశం లో జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, టిటిడిఈఓ, జేఈఈఓ, విజిలెన్స్ ఆఫీసర్ పాల్గొన్నారు.
ఈనెల 25వ తేదీన ఆదివారం రథసప్తమి సందర్భంగా తిరుమలకు 2 లక్షల నుంచి మూడు లక్షల భక్తులు హాజరవుతారని ఆ ఒక్క రోజే స్వామివారిని అన్ని వాహనాల్లో తిరుమల వీధిలో ఊరేగిస్తారని వచ్చే భక్తులకు పలు రకాల పిండి వంటలతో ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు.

