ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సీతానగరం టిడిపి నేతలు
కాకినాడ జిల్లా జగ్గంపేట : జగ్గంపేట మండలం ఇర్రిపాక ఎమ్మెల్యే స్వగృహం నందు జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండల సభ్యులు జ్యోతుల నెహ్రూకు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జగ్గంపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ(నగరం బుజ్జి) ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి ఒకటో తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా ప్రియతమ నేత జ్యోతుల నెహ్రూ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శన సేవలో ఉన్నారని అనంతరం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని స్వగృహానికి ఆదివారం చేరుకోవడంతో మా అభిమాన నాయకుడిని మర్యాదపూర్వకంగా కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరి సత్యనారాయణ, కాకర్ల కృష్ణాజి, గుడపాటి సత్యనారాయణ ( పెద్ద), పిండి రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.
