ఘనంగా జయ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ బచ్చు రమేష్ పుట్టినరోజు వేడుకలు
పేదవాళ్లకు ప్రాణదాత డాక్టర్ రమేష్
కాకినాడ జిల్లా జగ్గంపేట : జగ్గంపేట జయ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ బచ్చు రమేష్ జన్మదిన వేడుకలు ఆయన సన్నిహితులు వెలిశెట్టి బుజ్జి, సీరపు బాలు రెడ్డి, బోండా రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయనను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వైద్యం ఒక వ్యాపారం లా ప్రజలను దోచేస్తున్న పరిస్థితుల్లో జగ్గంపేట పరిసర ప్రాంతాల ప్రజలకు ఏజెన్సీ సుదూర ప్రాంతాల నుండి వచ్చే నిరుపేద ప్రజలకు తక్కువ ఖర్చుకు వైద్య సేవలు అందిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను జాయిన్ చేసుకుని అత్యవసర చికిత్స అందిస్తూ ఆయుష్ పోస్తున్న తనదైన రీతిలో వైద్య సేవలు అందిస్తూ పేదోడి డాక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సాధించిన డాక్టర్ రమేష్ పుట్టినరోజు వేడుకలు తమ సన్నిహితులు నిర్వహించామని ఆయన మరెన్నో పుట్టినరోజుజరుపుకోవాలనికోరుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెలిశెట్టి బుజ్జి, సీరపు బాలు రెడ్డి, బోండా రాజేష్,అంగజాల శ్రీను, సుంకర సతీష్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

