కాకినాడ జిల్లా జగ్గంపేట : ముళ్లపూడి ఈశ్వరి చదువు బీకాం కంప్యూటర్స్
కూచిపూడి నృత్యంలో డిప్లమో చేసి ఇప్పుడు . ఉన్నత చదువులకు ఈశ్వరి కి ఆర్థికంగా సహాయ పడాలని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఒక లక్ష 16 వేల రూపాయలు చెక్కును బుధవారం జగ్గంపేట మండలం ఇర్రిపాక శివ కేశవుల ఆలయం వద్ద ఈశ్వరి తల్లి డాన్స్ టీచర్ విజయలక్ష్మి కి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చెక్కును అందించారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూమన ప్రాచీన కళలను ప్రోత్సహిస్తూ మమ్మల్ని మన కూచిపూడి మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఎంతగానో కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాకు ఆర్థిక సహాయం అందిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణికి, యువ నాయకులు జ్యోతుల నవీన్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, జగ్గంపేట టౌన్ టిడిపి అధ్యక్షులు పాండ్రంకి రాంబాబు, జగ్గంపేట టౌన్ టిడిపి సెక్రటరీ కోడూరి రమేష్, గద్దే మారుతీ తదితరులు పాల్గొన్నారు.
