కాకినాడ జేసీగా అపూర్వ భరత్ బాధ్యతలు స్వీకరణ
కాకినాడ, : కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా జేసీగా అపూర్వ భరత్ శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. అపూర్వ భరత్ రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయనకు జిల్లాకు చెందిన పలువురు జిల్లా అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఇంతకుముందు ఆయన చింతూరు ఐటిడిఏ పిఓగా బాధ్యతలు నిర్వహించారు. కాకినాడ జిల్లా జేసీగా పనిచేసిన రాహుల్ మీనా బదిలీపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కమిషనర్గా వెళ్లారు. సుమారు 50 రోజుల తరువాత కాకినాడ జిల్లా జేసీగా అపూర్వ భరత్ బాధ్యతలు చేపట్టారు. అనంతరంపలువురు జిల్లా అధికారులు జేసీని పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, డిఆర్ఓ జె వెంకట్రావు, కాకినాడ ఆర్టీవో ఎస్ మల్లిబాబు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు, జిల్లా మేనేజర్ డి దేవుల నాయక్, కాకినాడ జిల్లా దేవాదాయ శాఖ అధికారి కే నాగేశ్వరరావు, దేవదాయ శాఖ తనిఖీదారుడు వి ఫణీంద్ర కుమార్, కాకినాడ అర్బన్ తహశీల్దార్ వీ జితేంద్ర, కలెక్టర్ కార్యాలయ ముఖ్య విభాగ అధిపతులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
