గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావును అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
కాకినాడ జిల్లా గండేపల్లి, అమరావతి : నాయకత్వ పటిమ, పార్టీ పట్ల అంకితభావంతో, అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తూ పార్టీ బలోపేతానికి మండల పార్టీ అధ్యక్షులు కృషి చేయాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుల కోసం నిర్వహించిన అవగాహన రెండు రోజులపాటు జరిగాయి.
ఈ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావును ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించి మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇప్పటినుంచి కార్యకర్తలను సమన్వంతం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ సందర్భంగా వారికి వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. క్యాడర్ నిర్వహణతో పాటు లబ్ధిదారులకు పథకాల కార్యాచరణ సక్రమంగా అమలు జరిగేలా చూడాలని, సోషల్ మీడియాల బాధ్యతాయుతమైన వినియోగంపై విలువైన సూచనలు అందించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో మండల పార్టీ అధ్యక్షుల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

