Hot Posts

6/recent/ticker-posts



 అనకాపల్లి నుండి తిరుమలకు చేపట్టిన గోవింద మాలతో పాదయాత్ర

మార్గం మధ్యలో జగ్గంపేటలో నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఆతిథ్యం, జగ్గంపేట ఎమ్మెల్యే,తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ కలిశారు...

కాకినాడ జిల్లా గండేపల్లి :అనకాపల్లి నుండి తిరుపతి  పాదయాత్రగా పదిమంది గోవింద మాలదారులు ఈనెల 7వ తేదీ ఆదివారం బయలుదేరారు..ఈ పాదయాత్ర 11తేదీ రాత్రి కాకినాడ జిల్లా జగ్గంపేటకు చేరుకుంది.. ఆ పాదయాత్ర బృందానికి గండేపల్లి మండలం జడ్ రాగం పేట పంచాయతీ పరిధిలోగల మోహన్ కృష్ణ రెసిడెన్సిలో  గోవిందు మాలదారులందరికీ   

 భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఉండడానికి బస, భోజన వసతి ఏర్పాట్లు చేశారు.

శుక్రవారం ఉదయం తిరిగి పాదయాత్రగా ముందుకు బయలుదేరిన గోవిందులకు నాగేంద్ర చౌదరి ఏర్పాటుచేసిన 

పండ్లు,దుప్పట్లును ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించి, వారిని పూలమాలలతో సత్కరించారు. 

ఈ సందర్భంగా వారితో కలసి గోవింద నామస్మరణతో కొంత దూరం పాదయాత్ర వేశారు.ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరునడుబిగించాలన్నారు.సుమారు 800 కిలో మీటర్లు తిరుపతి కాలినడకన బయలు దేరిన వీరి పాదయాత్ర ఆ గోవిందుని దయతో సఫలీకృతం కావాలన్నారు. 

గోవిందుల అభ్యర్థన మేరకు స్వామి వారి దర్శనానికి తన సహాయ సహకారాలుఉంటాయన్నారు. ప్రతిరోజు నాగేంద్ర చౌదరి అనేక దేవస్థానాలకు పాదయాత్రగా వెళుతున్న భక్తులకు ఆశ్రయము ఇచ్చి భోజన కల్పిస్తున్నారని హిందూ ధర్మ పరిరక్షణ కోసం, గో రక్షణ కోసం ఆయన చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండపాక అప్పన్న దొర,బద్దిసురేష్,పాలచర్ల మంగరావు,మండ్రు ఎర్ర బాబు,సాయిరాం శ్రీను, రెడ్డి విజయ్, కొట్టేటి సత్తిబాబు, ముచుపల్లి వీర్రాజు, మంచివి ప్రసాద్, దుర్గాజి తదితరులు పాల్గొన్నారు.