కాకినాడజిల్లా అధ్యక్షుడిగా రెండవసారి నియమితులైన జ్యోతుల నవీన్
జగ్గంపేటలో అంబరాన్నంటిన సంబరాలు రావులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జ్యోతుల నవీన్
కాకినాడ జిల్లా జగ్గంపేట డిసెంబర్ 16: కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి మళ్లీ ఆయనకే అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం మంగళవారం సాయంత్రం స్థానిక రావులమ్మ అమ్మవారి ఆలయం వద్ద జ్యోతుల నవీన్ ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానుల కోలాహలం మధ్య కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
అభిమానులు మందు గుండు సామాగ్రితో జై జై నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరు ఎక్కించారు. తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గ నాయకులు అందరూ విచ్చేసి ఆయనను పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ అధిష్టానం నుంచి మళ్లీ నాకు రెండోసారి జిల్లా టిడిపి అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి జిల్లా టిడిపి నాయకులు అందరికీ నా దైవం నా తండ్రి జ్యోతుల నెహ్రూకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పార్టీని మరింత బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడే విధంగా పనిచేస్తానని ఆయన అన్నారు
. ఈ కార్యక్రమంలో అడపా భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణి బాబు, తోట రవి, వీరం రెడ్డి కాశి బాబు, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, పైడిపాల సూరిబాబు అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


