కాకినాడ జిల్లా, జగ్గంపేట కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, పెద్దాపురం సబ్ డివిజన్ జగ్గంపేట సర్కిల్ లో సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి దిశగా సమాజాన్ని నడిపించాలనే లక్ష్యంతో సైకిల్ ర్యాలీ ను నిర్వహించడం జరిగింది.
ఈ సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, క్రమశిక్షణ, బాధ్యతాయుత జీవనం, తల్లిదండ్రుల సంరక్షణలో సరైన మార్గదర్శకత్వంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఆరోగ్యం ఉంటేనే జీవితం లో ఎన్నో విజయాలు సాధించవచ్చని, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటే సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావచ్చని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు.
ఈ సైకిల్ ర్యాలీ ప్రజలకు మంచి ప్రేరణనిచ్చి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలనే సంకల్పాన్ని కలిగించేలా జగ్గంపేట కిర్లంపూడి వీధిలలో తమ సిబ్బందితో సైకిల్ ర్యాలీ ను విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎస్సై రఘునాధ రావు స్టేషన్ సిబ్బంది కిర్లంపూడి ఎస్సై జి సతీష్ మరియు స్టేషన్ సిబ్బంది స్థానిక యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





