కాకినాడ జిల్లా జగ్గంపేట : జగ్గంపేట మండలం ఇర్రిపాక శివాలయం వద్ద జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన కందుల చిట్టిబాబుకు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించి భగవద్గీత అందించిన భారతీయ ధర్మపరిషత్ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పాలచర్ల నాగేంద్ర చౌదరి.
ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ మాకు అత్యంత ఆప్తులు కందుల చిట్టిబాబు జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ టీం లో పదవి పొందడం వారి ఇరువురు జిల్లా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు అనే విధంగా పనిచేస్తారని వారి నాయకత్వంలో పంచాయతీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు ఎన్నికలు అన్ని కూడా కూటమి పార్టీలు విజయం విజయం సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన నాగేంద్ర చౌదరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు, కందుల విజయ్, కందుల వినయ్ తదితరులు పాల్గొన్నారు.
