Hot Posts

6/recent/ticker-posts



 మహోన్నతమైన వ్యక్తి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు ఎంపీపీ అత్తులూరి నాగబాబు

కాకినాడ జిల్లా జగ్గంపేట : స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి వేడుకలు జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు), జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు ముఖ్యఅతిథిలుగా హాజరై కీర్తిశేషులు కొనిజేటిరోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా కొత్త కొండబాబు మాట్లాడుతూ ఆర్యవైశ్య కులంలో పుట్టి ఉమ్మడిఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏకైక వ్యక్తి కీర్తిశేషులు రోశయ్య అని, ఆయన గవర్నర్గా కూడా సేవలు అందించారని ఆయన ఏ పదవి చేపడితే ఆ పదవికి ఎంతో వన్నె తెచ్చారని, ఆర్థిక మంత్రిగా 16 సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. 

ఆరు దశాబ్దాలు ప్రజాసేవ అందించారని, మంచి వ్యక్తిత్వం గల మహోన్నతమైన వ్యక్తి అని ఆయన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ మానేపల్లి బంగార్రాజు, బోండా నూకబాబు, కొత్త శ్రీరామకృష్ణ (రాము), చిత్రపు బాబు, బొండా వీర సత్య,వి. నాగసత్య, బొండాడ జగన్, పాబోలు స్వామి, కంచర్ల బాబు తదితరులు పాల్గొన్నారు.