కాకినాడ జిల్లా జగ్గంపేట
ఈ సందర్భంగా డిఎస్‌పి జగ్గంపేట పోలీసుస్టేషన్ ప్రాంగణం, లాక్‌అప్స్, రికార్డులు, ప్రాపర్టీ స్టోరేజ్ రూమ్, కేస్ డైరీ (CD) ఫైళ్లను సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్ సిబ్బందితో మాట్లాడి విధుల నిర్వహణలో మరింత క్రమశిక్షణ, పారదర్శకత, ప్రజా సేవా దృక్పథంతో పని చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్‌లో శుభ్రత, రికార్డుల నిర్వహణ, సాంకేతిక వనరుల వినియోగం, ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా గ్రామాలను సందర్శిస్తూ శాంతి భద్రతలపై, సైబర్ క్రైమ్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై జరిగే నేరాలు మొదలగు వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కేసుల పెండెన్సీ తగ్గించాలి. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెంచాలి. ప్రాపర్టీ కేసుల్లో రికవరీ సాధించాలి. రోడ్డు ప్రమాదాల నియంత్రణ మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చేయాలని సుచించారు.
కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ వారి ఉత్తర్వులు పాటించి, జగ్గంపేట పిఎస్ పరిధిని, నేర రహిత ప్రాంతంగా చేయాలని డిఎస్పి కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కె శ్రీనివాస్ , జగ్గంపేట ఎస్సై రఘునాథరావు , స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.



