Hot Posts

6/recent/ticker-posts



 ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పర్యటన సందర్భంగా పెరవలిలో జరిగే బహిరంగ సభ లో పాల్గొనడానికి విచ్చేసిన ఆయనకు హెలి ఫ్యాట్ వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికినజగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం వేదిక వద్ద సాలువాతో ఘనంగా సత్కరించి నియోజకవర్గం లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. 

ముఖ్యంగా గ్రామీణ రహదారులు బీటీ రోడ్లుగా నిర్మించుకోవడం, గ్రామాల్లో మిగిలి ఉన్న సిమెంట్ రోడ్లు పూర్తి చేసుకోవడం అతిముఖ్యంగా గ్రామాల్లో ఉన్న చెరువుల నుండి మైక్రో ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసిన మంచినీరు ప్రతి ఇంటికి అందించే వాటర్ గిడ్ పథకాన్ని కూడా నియోజవర్గం అమలు చేసే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు సమకూర్చాలని పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు.

 ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ పి రాజశేఖర్, తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.