కాకినాడ జిల్లా జగ్గంపేట : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం -2025 డిసెంబర్ 21 ఆదివారం రోజున ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొనాలని పెద్దాపురం డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ ఓ ప్రశాంతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి ఆహ్వాన పత్రం అందించారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాకినాడ జిల్లా గల అన్ని పల్స్ పోలియో బూత్ లలోనూ, అన్ని ఆరోగ్య ఉప కేంద్రంలో యందు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యందు, ఏరియా ఆసుపత్రి యందు మరియు జిల్లా ఆసుపత్రి యందు పల్స్ పోలియో కార్యక్రమం 2025 డిసెంబర్ 21న నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొనాలని ఆహ్వానం పలికామని పోలియో మహమ్మారి నుండి పిల్లలను కాపాడి పోలియో రహిత ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జె నరసింహ నాయక్, కలెక్టర్ సకిలి సమ్మోహన్ ఆధ్వర్యంలో జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడపా భరత్, అత్తులూరి నాగబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, ఎండిఓ చంద్రశేఖర్, ఎమ్మార్వో రమేష్, రాజపూడి పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పూజ, డాక్టర్ మురళి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
