కాకినాడ జిల్లా జగ్గంపేట : కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన చుండ్రు వెంకన్న రావు చౌదరి జిల్లా టిడిపి ఉపాధ్యక్షులుగా నియమితులైన శుభ సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ను జగ్గంపేట మండలం ఇర్రిపాక వ్యవసాయ క్షేత్రం లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నవీన్ వెంకన్న రావు చౌదరిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను కలిసి ఘనంగా సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వెంకన్న రావు చౌదరి మాట్లాడుతూ నాకు జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన అధినేత చంద్రబాబుకి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి జిల్లా టిడిపి జ్యోతుల నవీన్ కి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నవీన్ నాయకత్వంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించే దిశగా కార్యకర్తలు అందరూ సమిష్టి కృషితో పని చేస్తామని వెంకన్న రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్ వి ఎస్ అప్పలరాజు, కోటగిరి మహేంద్ర, బుజ్జి బాబు చౌదరి, గొల్లపల్లి బుజ్జి, వెలుగుల లక్ష రావు, మేడిశెట్టి పట్టాభి, గండి వెంకటేశ్వరరావు, కంటే సత్తిబాబు, వాసిరెడ్డి సత్యనారాయణ, పబ్బినేడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

