కాకినాడ జిల్లా జగ్గంపేట : కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షు లు జ్యోతుల నవీన్ రెండోసారి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన శుభ సందర్భంగా జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం, జగ్గంపేట చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ముందుగా వేద పండితులు మామిళ్ళపల్లి అయ్యప్ప ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి శేష వస్త్రం కప్పి వేద ఆశీర్వచనం చేసి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను జ్ఞాపికగా అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన జ్యోతుల నవీన్ కు మరోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమించిన శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆర్యవైశ్యులను గుర్తించి ఎప్పటికప్పుడు మాకు మంచి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
జగ్గంపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పాలకుర్తి సురేష్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగార్రాజు, బొండా నూకబాబు, కంచర్ల శ్రీనివాస్, వి నాగసత్య, దుర్గపు ప్రకాష్, వి శ్రీరామ్మూర్తి, బి వీరసత్య, బొండాడ జగన్(బంకు జగన్), చిత్రపు బాబు, ముమ్మిడివరపు సురేష్, కొత్త హరికిషన్, పాబోలుస్వామి, మాతంశెట్టి సాయిబాబా ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.


