పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడంలో టిడిపి ముందుంటుంది.... జాతీయ టిడిపి ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్
కాకినాడ జిల్లా , శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటించేందుకు ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి జాతీయ టిడిపి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. : పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాకినాడ జిల్లా టిడిపి పగ్గాలు చేపట్టి పార్టీని విజయ తీరాలకు నడిపించిన వ్యక్తి జ్యోతుల నవీన్ అని జాతీయ టిడిపి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటించేందుకు ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పలువురు టిడిపి నాయకులతో కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ స్వాగతం పలికారు. నారా లోకేష్ నవీన్ చూసిన వెంటనే ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లాలో పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం, టిడిపి విజయదుంబి మోగించేందుకు నవీన్ ఎంతో కష్టపడ్డారని ఆయన పార్టీకి చేసిన సేవలు గుర్తించే మళ్లీ ఆయనకి రెండోసారి జిల్లా టిడిపి పగ్గాలు టిడిపి అధిష్టానం అప్పగించిందని అన్నారు. రెండోసారి కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు జ్యోతుల నవీన్ నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.



