Hot Posts

6/recent/ticker-posts



 మల్లవరం గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి జ్యోతుల నవీన్

  ఒక్కొక్క బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, 5వేల రూపాయల నగదు అందించిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

 తూర్పుగోదావరి జిల్లా  : గోకవరం డిసెంబర్ 16: గోకవరం మండలం మల్లవరం గ్రామంలోముమ్మనగంగరాజు, ముమ్మన పెద్దకాపు,యల్లంశెట్టి వీర్రాజు,యల్లంశెట్టి వెంకటరమణ, కర్ణం నూక రత్నం ఐదు కుటుంబ లకు చెందిన రెండు తాటాకుల ఇల్లు అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా కాలిపోయి 

ఐదు కుటుంబాలు పూర్తి నిరాశ్రయులు అయ్యారు.అగ్ని ప్రమాదంతో మొత్తం 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని జ్యోతుల నవీన్ వద్ద బాధితులు విలపించారు. జిల్లా టిడిపి అధ్యక్షులు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ వారిని పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం 5000 తక్షణ సహాయం అందించి ప్రభుత్వం ద్వారా ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వ రణం అందించేందుకు కృషి చేస్తానని జ్యోతుల నవీన్ అన్నారు. 

ఈ కార్యక్రమంలో పిల్లా చంటిబాబు, ఉంగరాల రాము, ఎస్వీఎస్ అప్పలరాజు, దాసరి తమ్మన్న దొర, దాసరి సీతారామకృష్ణ,మల్లవరం గ్రామ సర్పంచ్: యిడుదుల లక్ష్మి అర్జునరావు,ఎంపీటీసీపాలకవర్గసభ్యులు,నాయకులు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.