రైతుల మేలుకోరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
‘రైతన్నా మీ కోసం’ రైతన్నల నుంచి విశేష స్పందన.
కూటమి ప్రభుత్వం తక్కువ కాలంలోనే ఎక్కువ మేలు
నాణ్యమైన విత్తనాలు, ఎరువులిచ్చాం
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట : రైతులు బాగుకోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసంవారోత్సవాలకార్యక్రమంవిజయవంతమైందనిజగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు.
అన్నదాత మేలు కోరే వ్యక్తి సీఎం చంద్రబాబు అని, రైతుల పేరుతో పార్టీ పెట్టుకుని వారిని అన్నివిధాలా వేధించిన ఘనుడు జగన్ అని జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. మండలంలోని సీతానగరం గ్రామంలో రైతన్నా మీకోసం ముగింపు కార్యక్రమం జగ్గంపేట వ్యవసాయ శాఖ ఏడి జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వర్క్ షాపులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముందుగా హనుమాన్ వ్రతం సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసే నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వారి బాగుకోరుకునే ప్రభుత్వం తమదన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి మార్చలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, వ్యవసాయాధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి ఏయే పంటలు వేయాలి... ఏ పంట వేస్తే అధిక దిగుబడులతో పాటు ధరలు లభిస్తాయి... ఏ ఎరువులు వాడాలి...? అనే అంశాలపై వివరించారన్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమ నిర్వహణపై అన్నదాతల్లోనూ సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అధికారులు సూచనల మేరకు పంట మార్పిడి చేస్తామని రైతులు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు, పారిశ్రమికాభివృద్ధితో పాటు వ్యవసాయానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నామన్నారు. వ్యవసాయంలో సాంకేతికతకు పెద్దపీట వేస్తూ పెట్టుబడులు తగ్గేలా చర్యలుతీసుకుంటున్నారన్నారు.
ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం, రాబడి
అధికారులు సూచించిన పంటలు వేయడం ద్వారా లాభాలు ఆర్జించొచ్చునని ఎమ్మెల్యే నెహ్రూ సూచించారు. ప్రస్తుతం చిరు ధాన్యల ఆహారాన్ని ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారని, రైతులు ఆ పంటలు సాగు చేయాలని సూచించారు. బోరు సదుపాయం ఉన్న రైతులందరూ ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఎమ్మెల్యే నెహ్రూ సూచించారు. అధికారుల సూచనల మేరకు ఎరువుల వినియోగించాలని రైతులకు సూచించారు.
సేంద్రీయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయంతో రాబడి రావడంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, కొత్త కొండబాబు, సర్వసిద్ధి లక్ష్మణరావు, వైభోగల కొండబాబు యాదవ్, ముత్యాల సత్యనారాయణ, తాతిన నాగేశ్వరరావు, ఈర్పిన శ్రీను, నిమ్మగడ్డ సత్యనారాయణ, పిండి రెడ్డమ్మ, వ్యవసాయ శాఖ అధికారులు ఎస్ నరసింహ, శ్రీవల్లి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



