Hot Posts

6/recent/ticker-posts




 అన్నదాతల అభివృద్ధికై కూటమి ప్రభుత్వం కృషి...

సేంద్రీయ వ్యవసాయంతో భావితరాలకు శ్రీరామరక్ష....

గండేపల్లిమండలం  మురారి గ్రామంలో రైతన్నా మీ కోసం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ....


కాకినాడ జిల్లా : గండేపల్లి మండలం మురారి గ్రామంలో గ్రామ ఉపసర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో జరిగిన రైతన్నా మీ కోసం కార్యక్రమం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు గరిమెళ్ళ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తో కలిసి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

ముందుగా ఇంటింటికి వెళ్లి రైతన్నా మీకోసం కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వం అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయంతో పాటు వివిధ పథకాల గురించి వారికి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే  జ్యోతుల నెహ్రూ, ఎంపీ సానా సతీష్, జ్యోతుల నవీన్ చేతుల మీదుగా  ధాన్యం డ్రయర్ ప్రారంభించారు.  మాట్లాడుతూ అన్నదాతలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. 

కర్షకులను చైతన్యవంతులను చేసేందుకు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు.నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, పుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే పంచ సూత్రాల ద్వారా అన్నదాతలకుఅండగా నిలుస్తుందన్నారు.పురుగుమందులతో, యూరియా అధిక వినియోగంతో మనం పండించే పంట మన పిల్లలుతినేఆహారంవిషతుల్యంఅవుతుందని తెలుసుకోవాలన్నారు. 

క్యాన్సర్ వంటి మహమ్మారి పెరగడానికి కారణం రసాయన ఎరువులు, పురుగుమందులేనని గుర్తించాలన్నారు.మరలా అందరూ ప్రకృతి సేద్యం, సేంద్రీయ సేద్యం వైపు మరలాల్సిన  అవసరం ఉందన్నారు. సరైన పంట వేయడంతో పాటు సరైన సమయానికి దిగుబడి వచ్చే విధానాలు అవలంబించడం ద్వారా గిట్టుబాటు ధరలు పొందవచ్చన్నారు. 

అగ్రిటెక్ద్వారా వ్యవసాయంలో సాంకేతికసాయాన్నిఅందించడం జరుగుతుందన్నారు. డ్రోన్ల ద్వారా మందులు, ఎరువులు పిచికారీ చేయడం వల్ల సమయం, ఖర్చు అదా అవుతుందన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ - పి. యం. కిసాన్ పథకం కింద రెండు విడతల్లో ఒక్కొక్కరికి రూ. 14 వేల వంతున అందజేశామన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో రూ.13,500 మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు,మహిళా రైతులకైతే 35శాతం సబ్సిడీ ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. కొబ్బరిలోనే 20 వరకూ పరిశ్రమలు పెట్టుకోవచ్చన్నారు. 

అరటికి సంబంధించి 10 వరకూ పరిశ్రమలు పెట్టుకోవచ్చన్నారు. డైరీలు పెట్టుకోవచ్చని సూచించారు. రైతు కుటుంబానికి సంధించిన మహిళలకు, పిల్లలకు సబ్సిడీ మీద రుణాలుఇచ్చిపరిశ్రమలనుఏర్పాటు చేసుకోవచ్చన్నారు.ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెట్టాలన్నారు. 

ఒక బస్తా యూరియా బదులు ద్రవ జీవామృతం వాడితే మంచిదన్నారు. ఎరువుల ఖర్చు, పెట్టుబడి ఖర్చు తగ్గిస్తే తగిన ఆదాయం లభిస్తుందని ఆదిశగారైతులుఆలోచించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడపా భరత్, తోట నవీన్, పోతుల మోహనరావు, కోర్పు సాయి తేజ ఎస్వీఎస్ అప్పలరాజు, పరిమిబాబు, అడబాల భాస్కరరావు, ఉంగరాల రాము, కుంచె రాజా, కందుల చిట్టిబాబు, ఉండవల్లి వీర్రాజు, అడబాల ఆంజనేయులు, కంటిపూడి సత్యనారాయణ, దిడ్డి శ్రీను , గండేపల్లి ఎండిఓ హరికృష్ణ సత్యారెడ్డి,గండేపల్లి జగంపేట ఏవోలు లక్ష్మి, నరసింహ ఉద్యాన శాఖ అధికారిని శ్రీవల్లి, అధికారులు పాల్గొన్నారు.