ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఒక పుస్తకం లా కాకుండా, ఒక బాధ్యతగా చూడాలి - డా ఒమ్మి రఘురామ్
వివేకానంద స్కూల్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
కాకినాడ జిల్లా జగ్గంపేట: మన దేశ చరిత్రలో ఎంతో గౌరవవంతమైన రెండు సందర్భాలు రాజ్యాంగ దినోత్సవం మరియు జాతీయ న్యాయ దినోత్సవం లను పురస్కరించుకొని ఈరోజు జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల్లో ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్ ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్ అంబేద్కర్రి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పిల్లలు అంబేద్కర్ మరియు బాబు రాజేంద్రప్రసాద్ తదితర దేశ నాయకుల వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా ఒమ్మి రఘురామ్ మాట్లాడుతూ
1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగసభ ఆమోదించిందని. అందుకే ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటామన్నారు.మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యంతసమగ్రత కలిగిన రాజ్యాంగమని.రాజ్యాంగం మన ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ,సమానత,న్యాయం,
స్వాభిమానం అనే విలువలను అందిస్తుందని.మన హక్కులు మనకు శక్తినిస్తాయని,మన కర్తవ్యాలు దేశాన్ని బలంగా నిలబెడతాయన్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారితో పాటు శ్రమించిన రాజ్యాంగ నిర్మాతలందరికీ మనం ఈ రోజున కృతజ్ఞతలు తెలపాలన్నారు.వారు మన దేశ భవిష్యత్తును నిర్మించిన శిల్పులని అన్నారు.జాతీయ న్యాయ దినోత్సవం కూడా ఇదే రోజున జరుపబడుతుందని. ఎందుకంటే ఈ రోజే మన దేశ న్యాయ వ్యవస్థకు పునాది అయిన రాజ్యాంగం ఆమోదించబడిందని అన్నారు. న్యాయవ్యవస్థ అంటే
తప్పు చేసిన వారిని శిక్షించడం మాత్రమే కాదు,నిర్దోషులను రక్షించడం,బలహీనులకు బలంగా నిలబడటం,ప్రజల హక్కులను కాపాడటం కూడా అని అన్నారు.
న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయసేవలో పనిచేసే అందరూ ప్రజల న్యాయహక్కులను రక్షించేందుకు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారని,వారికి మనం గౌరవం తెలియజేయాలన్నారు.
ఈ రెండు దినాలు మనకు ఒక సందేశం ఇస్తాయని అవి మనరాజ్యాంగాన్నిగౌరవించాలని,హక్కులను వినియోగించుకోవాలని,
కర్తవ్యాలను నిర్వర్తించాలని,
న్యాయం,సమానత,సత్యం అనే విలువలను మన జీవితంలో పాటించాలన్నారు.మన దేశం ముందుకు సాగాలంటే, ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఒక పుస్తకం కాకుండా, ఒక బాధ్యతగా చూడాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

