Hot Posts

6/recent/ticker-posts

జ్యోతుల ఫౌండేషన్ ద్వారా 224 మందికి పెళ్లి కానుక





 జ్యోతుల పౌండేషన్ ద్వారా224 జంటలకు పెళ్లి కనుక పంపిణీ *ఆడపడుచుల*కళ్ళల్లో ఆనందం

కాకినాడ జిల్లా జగ్గంపేట : స్థానిక కాపు సామాజిక భవనంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 224 జంటలకు ఒక్కొక్కరికి 20,000 చొప్పున సుమారు 45 లక్షల రూపాయలు చెక్కుల రూపాయలు చెక్కుల రూపంలో అందజేశారు. 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ సృజన కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పి రాజశేఖర్ హాజరయ్యారు. రాష్ట్రంలోనే జ్యోతుల నెహ్రూ ది ఒక ప్రత్యేక స్థానం ఆయన కుమారుడు తండ్రికి తగ్గ తనయుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జ్యోlతుల నవీన్ కుమార్ కూడా ఆయన పాద యాత్రలో ఇచ్చిన హామీ పెళ్ళి కానుక ప్రభుత్వానికి సంబంధం లేకుండా తన నియోజకవర్గంలో పెళ్లి చేసుకున్న ఆడపడుచులకు జ్యోతుల నెహ్రూ పౌండేషన్ ద్వారా అర్హులైన ప్రతి పేద *ఒక్కరికి 20 వేల రూపాయలు* చొప్పున అందజేశారు. 

ఇచ్చిన మాట నిలబెట్టు కోవడం తన తండ్రి నెహ్రూ నుంచి పుణికి పుచ్చుకున్న నవీన్ ఎంత మంది ఈ విషయం సాధ్యం కాదని చెప్పిన తను ఇచ్చిన హామీ మేరకు ముందుకు సాగుతున్న నాయకులు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ అని నియోజకవర్గ పరిధిలో నే కాకుండా ఉమ్మడి గోదావరి జిల్లాలో పార్టీల కు అతీతంగా  నాయకులు కార్యకర్తలు ప్రజలు మాట్లాడుకోవడం జగ్గంపేట నియోజకవర్గం లో తమ నాయకులు గా ఉన్నందుకు ఆనందంగా ఉందని మాట్లాడుకోవడం తము అందరికీ చాలా ఆనందంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అన్నారు . అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెళ్లి కానుక అందుకున్న లబ్ది దారులు మాట్లాడుతూ ఈ రోజుల్లో పెళ్ళి కి వచ్చి అక్షింతలు వేసి వెళ్ళి పోతారు కానీ ఇలా సొంత సొమ్ము ను పంచే నాయకులు జ్యోతుల కుటుంబం అని గత 2, నెలలు క్రితం 210 , మందికి పెళ్లి కానుక అందజేశారు, 

ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం తలపెట్టారు. నవీన్ తల్లి మణెమ్మ,  భార్య  లక్ష్మీదేవి, లు కూడా ఒప్పుకుని ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అడివి అభివృద్ధి సంస్థ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జోన్ 2, ఇన్చార్జి *సృజయ కృష్ణ రంగారావు చేతుల మీదుగా ఒక్కొక్కరికి 20, వేల రూపాయల చొప్పున మొత్తం 44,80,000 రూపాయలు, 224 చెక్కులు అందజేశారు, 

ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పిల్లా పాపలతో ఆయు రారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు, జగ్గంపేట నియోజకవర్గం క్లస్టర్ ఇన్చార్జి జాస్తి వసంతకృష్ణ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం గండేపల్లి మండలంలో సామూహిక పెళ్లిళ్లు నిర్వహించాలని జ్యోతుల నెహ్రు పౌండేషన్ ద్వారా నిర్వహించాలని సూచించారు డానికి యం ఎల్ ఏ, నెహ్రూ అంగీకరించారు, యం ఎల్ సీ పేరభతుల రాజశేఖర్ మాట్లాడుతూ పెళ్ళి కానుక అందుకున్న ప్రతి ఒక్కరూ నెహ్రూ దంపతులు, తనయుడు నవీన్ దంపతులను గుర్తు చేసుకోవాలని అన్నారు, పౌండేషన్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ ఎంత కష్టం వచ్చినా తను  ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతాననీ అన్నారు దానికి ముఖ్య అతిధి గా వచ్చిన సృజయ కృష్ణ రంగారావు ను తనకు తన నియోజకవర్గ ప్రజలకు సహకరించాలని కోరారు నూతన వధూవరులను ఆశీర్వదించారు . యం ఎల్ ఎ నెహ్రూ మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ ఏదో తాను యం ఎల్ ఎ గా ఉన్నంత కాలం ఉంచి ఆపేసేది కాదని తమ కుటుంబం ఉన్నంత కాలం ఈ పౌండేషన్ ద్వారా తన కుమారుడు నవీన్ కుమార్ ఇచ్చిన హామీలను కొనసాగుతాయని ఆయన అందరికీ తెలియజేశారు .

ఈ కార్యక్రమంలో యస్ వి యస్ అప్పలరాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, అడప భారత్, తోట రవి, జీను మణిబాబు, వీరం రెడ్డి కాశి బాబు, పోతుల మోహనరావు, పిల్ల చంటిబాబు, కోర్పు సాయి తేజ, అడబాల భాస్కరరావు, కందుల చిట్టిబాబు, బుర్రి సత్తిబాబు, దేవరపల్లి మూర్తి తదితర కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.