Hot Posts

6/recent/ticker-posts



 బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న పలువురుపై కేసులు నమోదు...ఎస్సై రఘునాథరావు

కాకినాడ జిల్లా: జగ్గంపేటలో శనివారం రాత్రి ఊరు శివారి ప్రాంత బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జగ్గంపేట ఎస్సై టి.రఘునాథరావు సిబ్బందితో శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో జగ్గంపేట శివారు ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న పలువురు అదుపులోకి తీసుకుని,వారిని స్టేషన్కు తరలించారు. 


బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వీరిని సోమవారం ఉదయం కోర్టుకు హాజరు పరచడం జరుగుతుందన్నారు.. 

ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జగ్గంపేట ఎస్సై రఘునాధరావు హెచ్చరించారు.