కాకినాడ జిల్లా: జగ్గంపేట లో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ కొరకు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సీఈవో టి రామచంద్ర నాయుడు నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె మాధవి లత తమ ఆదేశాల మేరకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో ఎన్ హెచ్ ఆర్ పి ఫారం జిల్లా జాయింట్ సెక్రటరీ ఎం వి రాఘవ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు హై స్కూల్ ప్రాంగణంలో జెండా వందనం అనంతరం శాసనసభ్యులు చేతుల మీదుగా మొదటి మొక్కను వెయ్యడం జరిగింది. అనంతరం హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులతో పాటుగా స్కూల్ సిబ్బంది విద్యా కమిటీ చైర్మన్ ల తో ఎన్ హెచ్ ఆర్ పి ఫారం సభ్యులంతా కలిసి మొక్కలు నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ పి ఫారం రాష్ట్ర ఇంచార్జ్ .పి ఏ వలి ఖాన్. నేషనల్ బోర్డ్ మెంబర్. బి రాంబాబు. జిల్లా అడిషనల్ సెక్రటరీ. కె ఎస్ ఆర్ వి డి ప్రసాద్. మండల ప్రెసిడెంట్. కాపవరపు వెంకటరాజు. మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

