కాకినాడ జిల్లా :జగ్గంపేట : స్థానిక రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో, నియోజకవర్గానికి చెందిన 14 కుటుంబాలకు రూ. 7 లక్షల 11వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను ఆదివారం కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగ్గంపేట నియోజకవర్గం లోని జగ్గంపేట మండలంలోని ఐదు కుటుంబాలకు, గండేపల్లి మండలం లోని నాలుగు కుటుంబాలకు, గోకవరం మండలంలోని నాలుగు కుటుంబాలకు, కిర్లంపూడి మండలంలోని ఒక్క కుటుంబానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతూ, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నిజమైన వరంగా నిలుస్తోందని తెలిపారు.
ముఖ్యంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పార్టీలకతీతంగా అందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించేందుకు పనిచేస్తూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు తీసుకువస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జీను మణి బాబు, బుర్రి సత్తిబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, రేఖ బుల్లి రాజు, బాదంపూడి ప్రకాష్, గల్లా శ్రీను, ముసిరెడ్డి శ్రీనివాస్, చింతల రామకృష్ణ, కందుల జమీలు, చిట్యాల బాబ్జి, చిట్యాల అప్పారావు, గుడివాడ రాజారావు, తదితరులు పాల్గొన్నారు.

