Hot Posts

6/recent/ticker-posts

పాఠశాలలను సందర్శించిన సీఐ వై ఆర్ కె శ్రీనివాస్

 కాకినాడ జిల్లా  ఎస్ పి జి బిందుమాధవ్   ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ  తీసుకోవాలని   ఆదేశాలు జారీ 

 జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం లో పలు పాఠశాలలను సందర్శించిన సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ సింహాద్రిపురం గ్రామంలో  హైస్కూల్లో  ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులతో ఈగల్ క్లబ్ మెంబర్స్ తో మాట్లాడి డగ్స్ వద్దు బ్రో, స్కూలు ఆవరణలో 100 మీటర్లకు లోపు సిగరెట్లు మరియు పొగాకు ఉత్పత్తుల అమ్మకం నిషేధమని, అదే విధంగా మైనర్స్కు ఎవరైనా సిగరెట్లు పొగాకు ఉత్పత్తులు అమ్మిన చర్యలు తీసుకోబడునని బహిరంగ ప్రదేశంలలో ధూమపానం నిషేధమని తెలియజేయడం జరిగింది  మరియు    విద్యార్థినీల భద్రత రక్షణకు  సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని  ఆరా తీయడం జరిగింది బాలికల రక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ: 

బాలికల రక్షణ పట్ల ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు. ఈ దినం బుధవారం నాడు కిర్లంపూడి(మం)వీరవరం  గ్రామంలో ఉన్నత పాఠశాలను సందర్శించి, స్థానిక ప్రధానోపాధ్యాయులు మరియు ఇతర ఉపాధ్యాయులతో మాట్లాడి బాలికల రక్షణ మరియు ఇతర విషయాలపై చర్చించారు. డ్రగ్స్ వద్దు బ్రో* అన్నది ప్రభుత్వ నినాదమని, దానిని చిత్తశుద్ధితో అమలు చేయుటకు కాకినాడ జిల్లా ఎస్పీ  జి బిందు మాధవ్  వారి ఉత్తర్వులు పాటిస్తున్నట్లుగాను, పాఠశాలకు 100 మీటర్ల లోపు సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మకం గాని , వాడకం గానీ నిషేధమని, ఎవరైనా ఉల్లంఘించినచో వారిపై చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సీఐ తెలిపారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఈగల్ క్లబ్బులు ఏర్పాటు చేసి నట్టు తెలిపారు.