Hot Posts

6/recent/ticker-posts

సొసైటీ చైర్మన్ గా బుర్రి సత్యనారాయణ

 జగ్గంపేట సొసైటీ చైర్మన్ గా బుర్రి సత్యనారాయణ

నూతన కమిటీల ఆధ్వర్యంలోసొసైటీలు అభివృద్ధి చెందాలి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ


కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం   జగ్గంపేట   సొసైటీ  చైర్మన్ గా   బుర్రి సత్యనారాయణ (సత్తిబాబు) నియమితులయ్యారు. జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జగ్గంపేటశాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు  తీసుకున్న బుర్రి సత్తిబాబు. జగ్గంపేట సొసైటీ త్రిసభ్య కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన  నండ్ల చిరంజీవి, పాలిశెట్టి సతీష్(జనసేన)ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కమిటీల ఆధ్వర్యంలో సొసైటీలు మరింత అభివృద్ధి చెందాలని అన్నారు.  బుర్రి సత్తిబాబు మాట్లాడుతూ జగ్గంపేట సొసైటీ చైర్మన్ గా అవకాశం కల్పించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కి, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నియోజవర్గంలో అతిపెద్ద సొసైటీ జగ్గంపేట సొసైటీ అని ఈ సొసైటీ వారి సహకారంతో  మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తూ రైతులకు సొసైటీ ద్వారా లభించే రాయితీలు అందిస్తూ వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు. సొసైటీ చైర్మన్ గా నియమితులైన బుర్రి సత్తిబాబు కి పలువురు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, పైడిపాల సూరిబాబు, బస్వా చినబాబు, సర్వసిద్ధి లక్ష్మణరావు, వేములకొండ జోగారావు, గుమ్మల అనంతలక్ష్మి, కానవరెడ్డి రామకృష్ణ, తిరుమలరాజు మురళి రాజు, కె కృష్ణంరాజు, కలిదిండి రాజశేఖర్, కాపవరపు ప్రకాశం, పడాల రాంబాబు, బండారు చిన్నయ్య, కంచి కృష్ణార్జున, పదిలం రాంబాబు, పెందుర్తి ఆసియా  తదితరులు పాల్గొన్నారు.