Hot Posts

6/recent/ticker-posts


 ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన మాణిక్యంకు అభినందనలు

కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బర్రె మాణిక్యంకు ఏ ఎస్ ఐ గా పదోన్నతి లభించడంతో జగ్గంపేట స్టేషన్లో ఎస్సై టి.రఘునాధరావు  ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. 

ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నూతనంగా ఏఎస్ఐగా యూనిఫామ్ ధరించి జగ్గంపేట స్టేషన్ కు హాజరయ్యారు.. దీంతో ఏఎస్ఐ మాణిక్యమును ఎస్ఐ రఘునాథరావు, సిబ్బందితో శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు .