Hot Posts

6/recent/ticker-posts

పండ్ల మొక్కలను నాటిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

 మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జెడ్ రాగంపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన పండ్ల మొక్క లు నాటే కార్యక్రమం కి జగంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మొక్కలు నాటే మంచి కార్యక్రమం ఎనర్జీఎస్ చేపట్టడం వల్ల ఇక్కడకు వచ్చే రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మంచి ఆక్సిజన్ అందుతుందని వారి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కూడా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, మారిశెట్టి భద్రం, అడబాల భాస్కరరావు, జాస్తి వసంత్, కందుల చిట్టిబాబు, బొల్లం రెడ్డి రామకృష్ణ, యర్రంశెట్టి బాబ్జి, శిలామంతుల వీరబాబు, కందుల కొండయ్య చౌదరి, కంటే సురేంద్ర, బొండా శ్రీనుబాబు, పిలా మహేష్, డాక్టర్ ప్రణీత్, ఎండిఓ కర్రిచంద్రరావు, ఏపీవో కృష్ణంరాజు, పోకల సుబ్బారావు, ఎన్ఆర్జిఎస్ సిబ్బంది, పంచాయితీ సిబ్బంది  పాల్గొన్నారు.