పారిశుద్ధ్యకార్మికుల జీతాలు ఆరువేల నుండి 15 వేలకు పెంచాలి
పాటంశెట్టి సూర్యచంద్ర
సామాజిక ఉద్యమకారుడు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులకు గ్రామానికి ఒక రకంగా 6,000 నుండి 10,000 లోపు జీతం ఇస్తున్నారని,చాలీచాలని జీతాలతో ప్రతిరోజు అప్పు చేస్తేనే గాని ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్నారని, పారిశుధ్య కార్మికులు సంతోషంగా ఉంటేనే స్వచ్ఛ గ్రామం,స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుందని వీరికి 15000 రూపాయలు పైన జీతాలు యిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అట్టడుగునున్నటువంటి నిరుపేద కుటుంబాలు దినదినాభివృద్ధి చెందడానికి గాను అక్షరాస్యత, బాల్యవివాహాల నిర్మూలన, బడి ఈడు పిల్లలందరినీ బడికి పంపించుట,చెడు వ్యసనాలు వదిలి మంచి మార్గంలో నడవాలని, కులమత రహిత నవ సమాజం కోసం అందరూ కృషి చేయాలని పాటంశెట్టి సూర్యచంద్ర బూరుగుపూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులు,గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రజలను కోరారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్న మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.పదవ తేదీన పాఠశాలల్లో జరిగే తల్లిదండ్రుల సమావేశంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు పాటంశెట్టి సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు.