రామవరం-రాజుపాలెం రహదారి
అడుగుకో గొయ్యి-గజానికో గుంత
పాటంశెట్టి సూర్యచంద్ర
సామాజిక ఉద్యమకారుడు
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం రామవరం నుండి కిర్లంపూడి మండలం రాజుపాలెం వరకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు దుస్థితి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూలనున్న రహదారులు సైతం అభివృద్ధి చేయడం అభినందనీయమని,రామవరం నుండి రాజుపాలెం వరకు ఉన్న ఆర్ అండ్ బి రహదారి నిర్మాణం కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలని పాటంశెట్టి సూర్యచంద్ర పాలకులను,అధికారులను కోరారు.రామవరం నుండి రాజుపాలెం వరకు 15 కిలోమీటర్ల ఆర్ అండ్ బి రహదారి నిర్మాణానికి 2022వ సంవత్సరంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టినా రోడ్డు నిర్మాణం నత్త నడకన సాగిందని 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేదని,కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రహదారికి మోక్షం లభిస్తుందని గత సంవత్సర కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నా నేటి వరకు రహదారి నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని సూర్యచంద్ర ఆరోపించారు.రెండు సంవత్సరాల క్రితం రహదారి పనులు తొందరగా చేయాలని అడుగుకోగొయ్యి, గజానికో గుంత కార్యక్రమం ద్వారా నాటి ప్రభుత్వం మీద అనేక నిరసన కార్యక్రమాలు చేశామని నేటి కూటమి ప్రభుత్వం ఈ రహదారిని తొందరలో నిర్మించకపోతే సంబంధిత గ్రామ ప్రజలతో నిరసనలు,ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పుతామని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వానికి ముందస్తుగా తెలియజేశారు.