Hot Posts

6/recent/ticker-posts

మహిళల బాలికల రక్షణ పట్ల అవగాహన కలిగిస్తున్న సిఐవైఆర్ కే శ్రీనివాస్


జగ్గంపేట సర్కిల్ లో మహిళలు, బాలికల రక్షణ,భద్రత, శక్తి యాప్ డౌన్లోడ్ గురించి విస్తృతంగా అవగాహన కార్యక్రమం లు

మహిళా రక్షణ కొరకు, కాకినాడ జిల్లా ఎస్పీ  జి బిందు మాధవ్ వారి ఉత్తర్వులు ప్రకారం విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న జగ్గంపేట సర్కిల్ పోలీసులు

ప్రభుత్వ పాఠశాలలు,హైస్కూల్ బిసి బాలికల వసతి గృహాo వద్ద

గండేపల్లి మండలం *మురారి* గ్రామ ప్రభుత్వ హైస్కూల్లో, *గండేపల్లి* ప్రభుత్వ హైస్కూల్లో  మరియు ఇతర విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహిస్తూ, మహిళలు, బాలికలపై జరుగుతున్న వివిధ రకాల వేధింపులు,దాడులు, నేరాలు, మోసాల గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరిస్తూ, నివారణ మార్గాలు,  శక్తి యాప్ డౌన్లోడ్ గురించి మరియు యాప్ మహిళల చేతి లో పాశుపత అస్త్రం లాంటిదని అవగాహన కల్పించారు. మహిళా మరియు బాలిక రక్షణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నట్టు, మహిళలపై జరుగు నేరాలలో చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజల సహాయము ఎంతో అవసరమని కోరారు. బాలికల అదృశ్యం, ఈవ్ టీజింగ్ లపై ప్రత్యేక బృందాలు పనిచేస్తునాము. అని సి ఏ వై ఆర్ కె శ్రీనివాస్ తెలియజేశారు