Hot Posts

6/recent/ticker-posts

ఎస్ ఐ జి సతీష్ బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్ పి బిందు మాధవ్


కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్   వారి ప్రత్యేక ఆదేశాల ప్రకారం   మహిళలు మరియు బాలికల అదృశ్యం కేసులలో  ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది

కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన  ఇద్దరూ మహిళలు, ఒక బాలుడు మరియు ఒక బాలిక తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి బూరుగుపూడి  గ్రామం నుంచి  9.11.2024 అర్ధ రాత్రి నుండి  అదృశ్యమైనారు  కాకినాడ జిల్లా ఎస్ పి   జి బిందు మాధవ్  వారు జిల్లా కేంద్రం నుండి అందించిన సాంకేతిక  సహకారంతో పెద్దాపురం ఎస్డిపిఓ   శ్రీహరి రాజు  పర్యవేక్షణలో జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో కిర్లంపూడి ఎస్ ఐ   జి సతీష్  డబల్యు హెచ్ సి గురుశ్రీ, పి సి శివప్రసాద్ టీమ్ మహారాష్ట్ర లోని సోలా పూర్  హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో విస్తృతంగా గాలించి, ఆ  కుటుంబ సభ్యులు నలుగురిని పట్టుకోవడం జరిగింది

బూరుగుపూడి గ్రామం నుండి అదృశ్యమైన కుటుంబ సభ్యులను వెతికి పట్టుకోవడంలో విశేష కృషి జరిపిన కిర్లంపూడి  ఎస్ ఐ ప్రత్యేక బృందాన్ని జిల్లా ఎస్ పి  జి బిందు మాధవ్ వారు అభినందించారు. 


CI YRK