Hot Posts

6/recent/ticker-posts

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జ్యోతుల నెహ్రూ

 గోకవరం సంజీవయ్య నగర్ లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

అనంతరం సంజీవయ్య నగర్ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమ నిర్వహణ


తూర్పుగోదావరి జిల్లా గోకవరం   సంజీవయ్య నగర్ కాలనీలో గోకవరం టౌన్ టిడిపి ప్రధాన కార్యదర్శి గున్నూరు లాజర్ ఆధ్వర్యంలో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు ముందుగా లాజర్ సూర్యకుమారి దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతులమీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. టిడిపి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని సంజీవయ్య నగర్ కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గారి విగ్రహాన్ని గున్నూరు లాజర్ సంజీవయ్య నగర్ లో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందనిఎన్టీఆర్ చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, అడపా భరత్, గాజింగం సత్తిబాబు, ఉంగరాల రాము, పాలూరి బోసు బాబు, దాసరి సీతారామకృష్ణ, మంగ రౌతు రామకృష్ణ, పిల్లా చంటిబాబు, చింతల రవికాంత్, ఎస్ బాబు, గల్లా రాము, పులపర్తి బుజ్జి, పైల శ్రీను, ఆచంట రాజు, గుండా శివ ప్రసాద్, మోట పత్తి ఆనంద్,  చీకట్ల రాజు, చింతాటి వెంకన్న, అధిక సంఖ్యలో మహిళలు టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.