ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించిన జగ్గంపేట మోడరన్ డిగ్రీ కాలేజ్ సిబ్బంది
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులో ని మోడరన్ డిగ్రీ కళాశాల లో ప్రిన్సిపాల్ డాక్టర్ డి చెన్నారావు ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహుకరించారు. ఈ సందర్భంగా చెన్నారావు మాట్లాడుతూ కొండలతో, గుట్టలతో ఉన్న ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన వాతావరణం గా తీర్చిదిద్ది మోడల్ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే నెహ్రూ నిర్మించారని ఇప్పటికే గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగిందని బాయ్స్ హాస్టల్, కాంపౌండ్ వాల్ నిర్మించాలని ఎమ్మెల్యేని కోరారు. వారు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడి శాంక్షన్ చేస్తానని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, మారిశెట్టి భద్రం, అడబాల భాస్కరరావు , జంపన సీతారామచంద్ర వర్మ, , దాసరి సీతారామకృష్ణ, కొండ్రోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు.