Hot Posts

6/recent/ticker-posts

పెన్షన్ నోచుకోని దివ్యాంగులు


అధికారులు మానవత్వంతో సమస్యలను పరిష్కరించాలి

పాటంశెట్టి సూర్యచంద్రసామాజిక ఉద్యమకారుడు

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం అర్హులైన లబ్ధిదారులు అందరికీ మానవత్వంతో ప్రభుత్వ పథకాలు అందించాలని పాటంశెట్టి సూర్యచంద్ర అధికారులను కోరారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచానికే పరిమితమైన ప్రతి ఒక్కరికి 15000 రూపాయలు యిచ్చి ఆదుకుంటామని ఎన్నికల్లో  నారా చంద్రబాబునాయుడు  చాలా స్పష్టమైన హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చాక సంబంధిత అధికారులు అనేక నిబంధనలతో అర్హులను నిరాశ పరుస్తున్నారని తెలిపారు.గోకవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ చినరాముడు  వద్దకు నూరు శాతం అందత్వంతో కంటిచూపు కోల్పోయి పింఛన్ రాక అనేక అవస్థలు పడుతున్న గుమ్మల్లదొడ్డి గ్రామానికి చెందిన ఇంజరపు రాంబాబు ని, మంచానికే పరిమితమైన అచ్యుతాపురం గ్రామస్తులు దివ్యాంగులు కోలా శివాజీ మరియు బండారు వెంకటరమణలకు పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని పాటంశెట్టి సూర్యచంద్ర జాయింట్ కలెక్టర్  చినరాముడుని కోరగా స్వయంగా వారి పరిస్థితులు చూసి చలించిన జాయింట్ కలెక్టర్  సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న అధికారులకు సూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు