ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయాన్ని కొల్లగొడుతున్న ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు విజయవాడ ఆంధ్ర మరియు కర్ణాటక సరిహద్దుల నుండి ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఏపీఎస్ ఆర్టీసీ మరియు కర్ణాటక ఆర్ టి సి బస్సులు మదనపల్లె నుండి చింతామణి బెంగుళూరు మరియు కడప నుండి బెంగుళూరు నుండి రాయచోటి మదనపల్లె చింతామణి బెంగుళూరు మరియు తిరుపతి నుండి బెంగుళూరు పైలర్ మదనపల్లె చింతామణి యలహంక బెంగుళూరు శ్రీకాళహస్తి నుండి బెంగళూరు వరకు చాలా తక్కువ సర్వీసులు నడుస్తున్నాయి.
ఈ మార్గాల నుండి ఏపీఎస్ఆర్టీసీ మరియు కర్ణాటక ఆర్టీసీ బస్సులకు విపరీతమైన డిమాండ్ ఆర్టీసీ సరైన సర్వీసు లేక ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రయాణానికి భద్రత కల్పించే ఆర్టీసీ ప్రతి గంటకు ఒక బస్సులు మదనపల్లె నుండి బెంగుళూరు మరియు కడప నుండి బెంగళూరు మరియు తిరుపతి నుండి బెంగళూరు పైలర్ మదనపల్లె చింతామణి యలహంక బెంగుళూరు రూట్లలో తెల్లవారుజామున 5:00am నుండి అర్ధరాత్రి 12: గంటల సర్వీసులను ఆర్టీసీ వారు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు గతంలో మేనేజింగ్ డైరెక్టర్ ఇటీవల విజయవాడలో చేసిన ఒప్పందం ఇరు రాష్ట్రాల ఆంధ్ర కర్ణాటక ఆర్టీసీల రెగ్యులర్ సర్వీస్‌ను పెంచడానికి ఆంధ్ర మరియు కర్ణాటక ప్రభుత్వాల నుండి గెజిట్ నోటిఫికేషన్‌ను ఆమోదించి, విడుదల చేయండి.
మరియు పై మార్గాల నుండి బస్సులను పెంచడానికి ఆంధ్ర మరియు కర్ణాటక ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకొని సర్వీసులు మాత్రం అంతంత మాత్రమే నడుపుతున్నారు ఆర్టీసీ అసమర్ధత వల్ల ప్రైవేట్ బస్సులు యాజమాన్యాలు ప్రయాణికులనుండి దొరికిన కాడికి దోచేస్తున్నారు ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రైవేటు బస్సుల దోపిడి నుండి ఆర్టీసీ యాజమాన్యాలు ప్రయాణికులను కాపాడాలని ప్రైవేటు బస్సులలో పడి ఇబ్బందుల నుండి ఆర్టీసీ విముక్తి కలిగించాలని ప్రయాణానికి భద్రత కలిగించే ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు

