Hot Posts

6/recent/ticker-posts

ఎమ్మెల్యే నెహ్రూని సత్కరించిన గోకవరం రైతులు


 గోకవరం ఎల్లమ్మ చెరువు పుంత రోడ్డు అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను సత్కరించిన రైతులు

కాకినాడ జిల్లా జగ్గంపేట : స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గోకవరం తెలుగు రైతు అధ్యక్షులు చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో గోకవరం ఎల్లమ్మ చెరువు పుంత రోడ్డు అభివృద్ధికి నిధులు ఇచ్చి రోడ్డు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను ఎల్లమ్మ చెరువు చైర్మన్ చింతల సత్యనారాయణ, వైస్ చైర్మన్ మై పాల భగవాన్ రైతులతో కలిసి ఎమ్మెల్యే నెహ్రూను సాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లమ్మచెరువు కు వెళ్లే పుంత రోడ్డు అద్వాన పరిస్థితిలో ఉండటంతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవ తీసుకుని పుంత రోడ్డు నిర్మాణం చేస్తూ రైతులకు అన్ని విధాలా సహకరిస్తున్న రైతు బాంధవుడు, మెట్ట ప్రాంత భగీరధుడు జ్యోతుల నెహ్రూను కలిసి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విచ్చేసామని ఈ పుంత రోడ్డును మరొక 500 మీటర్లు పెంచాలని, సచివాలయం 2 వద్ద ఉన్న ఖాళీ స్థలంలో రైతులకు కమ్యూనిటీ భవనం నిర్మించాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని రైతులు అన్నారు. ఈ కార్యక్రమంలో  రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.